Kakinada Files

Kakinada Files

మన కాకినాడ వాస్తవ్యులు

మన కాకినాడ ఆహ్లాదకరమైన వాతావరణానికి కేంద్రం. సముద్ర తీర ప్రాంతం ఆనుకొని ఉన్న సహజ వనరుల నెలవు. కేవలం ప్రకృతి వనరులే కాదు, మానవ వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతం. ప్రపంచానికి, దేశానికి ఎందరో మేధావులను, రచయితలను, క్రీడాకారులను, ప్రతిభావంతులను మన కాకినాడ అందించింది. అందిస్తోంది, అందిస్తూనే ఉంటుంది. విద్యా నిలయంగా ప్రసిద్ధికెక్కిన మన కాకినాడ ప్రతి ఏడాది మెరికల్లాంటి విద్యార్థులను తయారు చేస్తోంది. అలాంటి ఓ విద్యావంతులు, ప్రతిభావంతులు, మేధావి, వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, సామాజికవేత్త మన సానా సతీష్ బాబు గారు. ఆయన పుట్టిన నేల మన కాకినాడ. అందుకే సతీష్ బాబు గారికి కాకినాడ అంటే ఎనలేని ఆప్యాయత. మనసుతో ముడిపడిన అనుబంధం. విద్యాభ్యాసం నుంచి ఉద్యోగం వరకు కాకినాడ కేంద్రంగానే సాగింది. అంతగా ఆయన కాకినాడతో మమేకమయ్యారు. కాకినాడలోని ప్రతి చోటూ ఆయనకు సుపరిచితమే. ప్రతి గుండె చప్పుడు ఆయన వినినదే.

సానా సతీష్ బాబు గారి ప్రాథమిక విద్యాభ్యాసం కాకినాడలోని ఠాగూర్ కాన్వెంట్ లో జరిగింది.  అనంతరం పీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదివారు. మెకానిక్ ఇంజనీరింగ్ లో పట్టా పొందారు. చదువుకున్న కాలమంతా కాలి నడకనే ఆయన విద్యాలయానికి, ఇంటికి పయనం సాగించేవారు. కేవలం చదువులే కాదు ఎన్నో అనుభవాలు ఆయన పాఠ్య పుస్తకాల్లో పాఠాలతో పాటు జీవిత పాఠాలను కూడా నేర్పించాయి. అందుకే జీవితంలో ఉన్నత ఆశయాలకు బలమైన పునాదులు పడ్డాయి. వాటిని సాధించాలనే సంకల్పం ఆయనతో పాటు పెరిగి పెద్దగా అయ్యాయి. చదువు అనంతరం ఉన్నత ఆశయ సాధనతో 1994లో ప్రభుత్వ ఉద్యోగిగా ఎంపికయ్యారు. ఇంజనీరుగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. కాకినాడ జిల్లా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం, వారి పట్ల ఆయనకున్న ఆత్మీయ భావన ఉద్యోగంలో కూడా ఉత్తమ పనితీరుకు కారణమయ్యాయి. అనతికాలంలోనే పేరు ప్రతిష్టలను ఇచ్చాయి. ఉద్యోగిగా ఎక్కడా కూడా రాజీ పడలేదు. అంతగా తన పుట్టిన ఊరికి మేలు చేయాలని తపన పడ్డారు.

అందుకే 2004లో ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేశారు. హైదరాబాద్ వచ్చి తన పుట్టిన ఊరు నేర్పిన పాఠాల అనుభవంతో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణించారు. ఆయన సంపాదించిన పరపతి, హోదా, డబ్బు ఏది కూడా సానా సతీష్ బాబు గారికి సంతృప్తిని కలిగించలేదు. ఎందుకంటే జీవితాన్ని ఇచ్చిన ఊరికి ఇంకా ఏదో చేయాలనే తపన, తన అస్తిత్వానికి కారణమైన నేల ఆయనను కాకినాడ వైపు నడిపించాయి. సానా సతీష్ బాబు గారి అణువణువునా, ప్రతి ఆలోచనలో తన సొంతూరు ఉంది. అందుకే ఎంత ఎత్తుకు ఎదిగినా తనను తాను ప్రజల్లో ఒకరిగానే భావిస్తారు. వారికి సేవ చేయడమే కాకినాడ అభివృద్ధికి మొదటి మెట్టుగా అడుగులు వేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *